అంతర్జాతీయ ఈవెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్‌

పతాంగుల అంతర్జాతీయ పండుగకు సర్వం సిద్ధం అయ్యింది. ఈ రోజు నుంచి రెండు రోజులపాటు ఈ వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ప్రభుత్వం. ఈ వేడుకల్లో ఆరు దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు.

తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ గాలిపటాల పండుగకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. రేపటి నుంచి ఈ వేడుకలు రాజధానిలో ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు జరిగే వేడుకలకు ఆరు దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. వీరితోపాటు మూడు వందలమంది కైట్‌ ఫ్లైయర్స్ పాల్గొంటున్నారు. ఈ వేడుకలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

శంషాబాద్ దగ్గరలోని ఆగఖాన్‌ అకాడమీ ఈ పతంగుల పండుగకు వేదికకానుంది. హైదరాబాద్‌కు పతాంగుల పండుగతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామంటున్నారు టూరిజం అధికారులు.

దేశవిదేశాల ప్రతినిధులు ఈ పండుగలో పాల్గొంటారు. బాలిక విద్య ప్రోత్సహం, సాధికారిత లక్ష్యంగా ఈ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఒకేసారి 250 మంది గాలిపటాలను ఎగరవేసి ఆకాశాన్ని రంగుల మయం చేయనున్నారు. ఇప్పటికే నగరంలో పతంగుల సందడి మొదలైంది.

ఈ కార్యక్రంలో తెలంగాణ వంటకాలు ప్రధాన అకర్షణ నిలవనున్నాయి. వీటితో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు ఆకట్టుకోనున్నాయి. రెండురోజులపాటు జరిగే అంతర్జాతీయ గాలిపటాల పండుగకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం.