వ్యాపారం చేయండి.. ఉపాధి కల్పించండి..

కొత్తగా ఆలోచించండి.. కంపెనీ మొదలెట్టండి.. మిమ్మల్ని ప్రోత్సహించేందుకు మేమున్నాం అంటోంది కేంద్రప్రభుత్వం. అంకుర భారత్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడీ పదివేలకోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు, మూడేల్లు టాక్స్ హాలీడే ఇస్తున్నట్లు ప్రకటించారు.

కొత్త ఆలోచనలు చేసి ఉద్యోగాలు సృష్టించేవారి కోసమే.. సార్ట్‌అప్‌ ఇండియా. స్టార్టప్‌లు వేల కోట్ల డబ్బులు ఉన్న వాళ్లు, బ్యాంకు బ్యాలెన్సులతో చేసేవి కావు. ప్రజల కష్టనష్టాలను దూరం చేసేవి… స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ నోటి వెంట వచ్చిన మాటలివి. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా సార్టప్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంబించిన ఆయన కంపెనీలను స్టార్ట్‌ చేసేవాళ్లకు సహాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. స్టార్ట్‌ప్‌ ఇండియాకు భారీగా నిధులిస్తామని హామీ ఇవ్వడంతో పాటూ పలు రాయితీలను ప్రకటించారు.

ఏటా 25 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసేలా 10 వేల కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. స్టార్ట్‌ప్‌లకు పన్ను రాయితీతో పాటూ మరెన్నో సౌకర్యాలు కల్పించనున్నారు. మూడేళ్ల వరకూ ఆదాయపన్నుపై టాక్స్ హాలీడే ప్రకటించారు. కార్మిక, పర్యావరణ చట్టాలను పాటిస్తామని హామీ ఇస్తే మూడేళ్లదాకా తనిఖీలు చేయరు.

ఐటీ విజ్ఞానంలో చాలా ప్రగతిని సాదించాంగానీ, ఇంకా ఉద్యోగాలే చేస్తున్నామన్నారు ప్రధాని. యువత ఉద్యోగాలు సృష్టించే స్థాయికి చేరుకోవాలని మోడీ ఆకాక్షించారు.

ప్రధాని ఉద్వేగపూరిత ప్రసంగం అందరినీ ఉత్తేజపరిచింది. నీటిని చూసి భయపడేవాడికి ఈత ఎప్పటికీ రాదు. ఒకటి రెండుసార్లు నీటిలో దూకితేనే ఈత వస్తుంది.. ఇలాంటి మాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి.