ఆకట్టుకున్న ఆటో ఎక్స్ పో

Virat Kohli, Bollywood actor Alia Bhatt, second right pose with officials during the launch of Audi R8 V10

ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో 13వ ఆటో ఎక్స్‌పో ఘనంగా ప్రారంభమైంది. ఇండియా ఎక్స్‌పో మార్ట్‌ IEMగా పిలుస్తున్న ఈ ప్రదర్శనలో దాదాపు 20 దేశాల నుంచి వచ్చిన ఆటోమొబైల్‌ దిగ్గజాలు తమ కొత్త ఉత్పత్తులతో కొలువు దీరాయి. కార్లు , మోటార్‌ బైక్‌ల విభాగంలో కళ్లు చెదిరే మోడల్స్ తో ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది.

మారుతీసుజుకితోపాటు టాటా మోటార్స్‌, కొరియన్‌ సంస్థ హుండయ్‌ మోటార్స్‌.. జర్మనీ దిగ్గజం మెర్సిడీస్‌, ఇటలీకి చెందిన పియాజియో, జపాన్‌కు చెందిన హోండా కంపెనీల మోడళ్లు ఈ ప్రదర్శనలో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఒకటేమిటి ప్రపంచవ్యాప్తంగా పేరున్న అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి.

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకీ కొత్త ఎడిషన్‌ సుజుకి విటారా బ్రెజ్జాను లాంచ్‌ చేసింది.. ఫోర్డ్‌ ఇకో స్పోర్ట్‌, హ్యూండాయ్‌ క్రెటాతో ఇది పోటీ పడుతోంది.ఆడి స్పోర్ట్స్‌ కార్‌ ఆర్‌ 8 కొత్త ఎడిషన్‌ను మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంచ్ చేయగా.. టాటా జాగ్వార్ కారును బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ లాంచ్‌ చేశారు.

ఈ ఆటో ఎక్స్‌పోను సందర్శకులు ఈనెల ఐదో తేది నుంచి 9 తేదీ వరకూ దర్శించవచ్చు. తొలి రెండు రోజులు మీడియా పారిశ్రామిక ప్రముఖుల కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. గతేడాది సుమారు 5 లక్షలమంది ఈ ఆటో ఎక్స్‌పోను వీక్షించగా ఈసారి ఆ సంఖ్య 6 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఆటోఎక్స్‌పోతో పాటు ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో 7వ తేదీ వరకూ ఆటో విడిభాగాల షో జరుగనుంది.