కడపలో కోటి ఎర్రచందనం స్వాధీనం..

The consignment was being smuggled from the forests of Kadapa in Andhra Pradesh

అక్రమంగా రవాణా చేసేందుకు కడప జిల్లాలో నిల్వ ఉంచిన ఎర్ర చందనాన్ని సీజ్‌ చేశారు పోలీసులు. రైల్వే కోడూరు మండలం బాలు పల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన పోలీసులు రవాణాకు సిద్దంగా ఉన్న ఎర్ర చందనం కంటైనర్‌ను కనుగొన్నారు. పోలీసుల జాడ పసిగట్టిన స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. పట్టుబడిన ఎర్ర చందనం విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. కూంబింగ్ కొనసాగుతోంది.