నాన్న కోసం ‘రోల్స్ రాయిస్’…

మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు సంతోషంలో పొంగిపోతున్నాడట. దీనికి కారణం తన కుమారుడు వరుణ్ తేజ్ తన కోసం ఓ లగ్జరీ కార్ ను బహుమతిగా ఇవ్వడమేనట. వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘మిస్టర్’ ఇటీవలే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. అక్కడికి నాగబాబు ఒక సాధారణ కార్లో వచ్చాడట. అది చూసిన వరుణ్‌ వెంటనే తండ్రి కోసం కోటీ రూపాయలు విలువ చేసే రోల్స్ రాయిస్ కారును బుక్ చేశాడంట.

ఇలా వరుణ్ సొంత డబ్బుతో తనకు ఓ బహుమతిని ఇవ్వడంతో నాగబాబు సంతోషంగా ఫీల్ అయ్యాడంట. వరుస సక్సెస్ లు పొందుతున్న వరుణ్ ను చూసి ఇప్పటికే పుత్రోత్సాహంలో మునిగిపోతున్న నాగబాబుకు ఈ బహుమతి చిన్నదే అయినా తన కొడుకును చూసి మురిసిపోతున్నాడట. ఇక మరో మెగా హీరో రామ్ చరణ్‌ కూడా చిరంజీవి ప్రతి బర్త్ డే కు ఖరీదైన కార్లు బహుమతిగా ఇచ్చే విషయం తెలిసిందే.