టీడీపీ నిర్లక్ష్య ధోరణి వీడాలి: వైసీపీ నేత బొత్స

ప్రతిప‌క్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్‌పై ప్రజ‌లు ఎంతో న‌మ్మకం పెట్టుకున్నార‌ని, వారి కోసం తాము పోరాడ‌తామ‌ని వైసీపీ నేత బొత్స స‌త్యనారాయ‌ణ పేర్కొన్నారు. ప్రజా ప్రయోజ‌నాలను కాపాడుకోవ‌డంలో చంద్రబాబు ప్రభుత్వం విఫ‌ల‌మ‌యింద‌ని, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ చిత్తశుద్ధిని శంకిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. హోదాపై టీడీపీ డ్రామాలాడుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు. మ‌రోవైపు హోదాపై బీజేపీ కుంటి సాకులు చెబుతోందని బొత్స స‌త్యనారాయ‌ణ పేర్కొన్నారు.

కేంద్రంపై టీడీపీ ఎందుకు ఒత్తిడి తేవ‌డం లేదని ఆయ‌న ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేన‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. హోదాపై టీడీపీ డ్రామాలాడుతోంద‌ని, చంద్రబాబు ప్రభుత్వం త‌మ నిర్లక్ష్య ధోర‌ణిని వీడాల‌ని ఆయ‌న అన్నారు. కేవీపీ రాజ్యసభలో పెట్టిన ప్రత్యేక హోదా బిల్లుకి తాము మ‌ద్దతిస్తున్నట్లు తెలిపారు.