తెలంగాణకు రూ.17వేల కోట్ల పథకాలు: దత్తాత్రేయ

తెలంగాణ పర్యటనలో భాగంగా మోదీ రాష్ట్రానికి రూ.17 వేల కోట్ల పథకాలను ప్రకటిస్తారని కేంద్రమంత్రి దత్తాత్రేయ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కార్యకర్తల సమావేశం పనులను పరిశీలించిన అనంతరం అయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు సంబంధం లేదని, అవి రెండూ వేరువేరని కేంద్రమంత్రి దత్తాత్రేయ స్పష్టం చేశారు. గజ్వేల్‌ సభలో కేంద్రమంత్రులు వెంకయ్య, గంగారాం పాల్గొంటారు కేంద్రమంత్రి దత్తాత్రేయ వెల్లడించారు.