7 కోట్లకు అమెరికా రిలీజ్ హ‌క్కులు…

ఇటీవల కాలంలో తెలుగు సినిమాల‌కు ఓవ‌ర్సీస్ మార్కెట్ అసాధార‌ణంగా పెరిగింది. అక్కడ మ‌న సినిమాల‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. స్టార్ హీరోల సినిమాల నుంచి యంగ్ హీరోల సినిమాల వ‌ర‌కూ భీభ‌త్సమైన క్రేజ్ ఉంటోంది. టాలీవుడ్‌కు ఇలాంటి రైజింగ్ వాతావ‌ర‌ణం చోటు చేసుకోవ‌డం ఇదే తొలిసారి. రిలీజ్ త‌ర్వాత రిజ‌ల్ట్ ఎలా ఉన్నాస‌రే సెట్స్‌లో ఉండగానే సినిమాకు భారీ ఎత్తున బిజినెస్ జ‌రిగిపోతోంది. అదీ యూఎస్ మార్కెట్ లో తెలుగు సినిమాల‌ క్రేజ్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. ‘బాహుబ‌లి’, ‘శ్రీ‌మంతుడు’ త‌ర్వాత నాని న‌టించిన ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌’ లాంటి చిన్న సినిమాకి అంతే క్రేజు ఏర్పడింది.

ఇటీవ‌ల మెగాస్టార్ క‌మ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబ‌ర్ 150’ సినిమా బాహుబ‌లిని బీట్ చేసి ఏకంగా 13 కోట్లకు అమ్ముడైంది. తాజాగా కింగ్ నాగార్జున‌- రాఘ‌వేంద్రరావు కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ‘న‌మో వేంక‌టేశాయ’ భ‌క్తిరస చిత్రానికి కూడా భారీ రేటు ప‌లికింది. ఓ ప్రముఖ సంస్థ 7 కోట్లకు అమెరికా రైట్స్ ను ద‌క్కించుకుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ రేంజ్ ధ‌ర ప‌ల‌కడానికి కార‌ణం ఈ క్రేజీ క‌ల‌యికేన‌ని అంటున్నారు. గ‌తంలో వీరిద్దరి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామ‌దాసు’ చిత్రాలు బ్లాక్ బ‌స్టర్ హిట్స్‌ సాధించాయి. ఆ క్రేజ్ తోనే ‘న‌మో వేంక‌టేశాయ’కు ఇంత రేటు ప‌లికింద‌ని అంటున్నారు. నాగార్జున‌కు ఓవ‌ర్సీలో ఈ రేంజ్ బిజినెస్ చేసిన తొలి సినిమా ఇదే కావ‌డం విశేషం.