డ్యాన్స్ బార్లకు ఆంక్షలు సడలింపు…

ముంబైలోని మూడు బార్లకు ఆంక్షలు సడలించింది సుప్రీంకోర్టు… ముంబైలోని మూడు డ్యాన్స్ బార్లకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ బార్లలో సీసీటీవీలు పెట్టకూడదని ఆదేశించింది. ఆ బార్లను రాత్రి 1.30 గంటల వరకు నడుపుకోవచ్చని తెలిపింది.

మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం బార్లపై నిఘా పెంచాల‌ని, ఆల్కహాల్‌పై నిషేధం విధించాల‌ని, సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాల‌ని పొందుపరిచింది… ఈ నేప‌థ్యంలో ముంబైలోని మూడు బార్లకు మాత్రం ఆ ఆంక్షల‌ను సడలించింది సుప్రీం. డాన్స్ చేసే ప్రాంతంలో మ‌ద్యాన్ని అందజేయడాన్ని నిషేధించడం హాస్యాస్పదమని… నిబంధ‌న సరికాదని అభిప్రాయ‌ప‌డింది.

బార్‌ లైసెన్స్‌ ఉన్నప్పుడు మద్యం సర్వ్‌ చేయడం సరికాదని చెప్పలేమంది సుప్రీం… అవసరమైతే ప్రవేశద్వారం దగ్గర సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. కేసు విచారణ నవంబర్‌ 24కు వాయిదా వేసింది.