అమ్మకు గవర్నర్‌ పరామర్శ…

తమిళనాడు ఇంచార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు… చెన్నై అపోలో ఆస్పత్రిలో సీఎం జయలలితను పరామర్శించారు. గవర్నర్‌ ఆస్పత్రికి వచ్చిన సమయంలో జయలలిత కేబినెట్‌లోని సీనియర్‌ మంత్రులు కూడా ఆస్పత్రికి వచ్చారు. మరోవైపు అన్నా డీఎంకే శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అమ్మ అభిమానులు పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

అనారోగ్యంతో జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే… మరోవైపు అమ్మకు లండన్‌ నుంచి వచ్చిన వైద్యులు చికిత్స అందిస్తున్నారని… డీఎంకే నేతలు డిమాండ్‌ చేసినట్టుగా అమ్మ ఆస్పత్రిలో ఉన్న ఫొటోలను విడుదల చేయాల్సిన అవసరం లేదని అన్నా డీఎంకే నేతలు కొట్టిపారేశారు. ఇలా ఉండగా అమ్మకు ఏం జరిగిందోనన్న టెన్షన్‌ అభిమానుల్లో నెలకొంది.