రాజకీయాల్లో ఉన్నంత కాలం కాంగ్రెస్‌లోనే ఉంటా …

రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు కాంగ్రెస్ నేత సి రామచంద్రయ్య… కాంగ్రెస్ ఇప్పటికే కోలుకుంది, ప్రజలు వాస్తవాన్ని తెలుసుకుంటున్నారన్నారు… తనకు ఎలాంటి లొసుగులులేవని… రాజకీయాల్లో ఉన్నప్పుడు అనుచరులు కూడా తెలిసీతెలియక చిన్నచిన్నపొరపాట్లు చేసి ఉండవచ్చన్నారు రామచంద్రయ్య. నాయకులు అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్లిపోతారన్న ఆయన… పార్టీ వీడిన నేతలు అధికారం వస్తుందంటే మళ్లీ కాంగ్రెస్‌ గూటికే చేరతారన్నారు…

చంద్రబాబు పాలన ఎలా ఉందో ప్రజలను అడిగితే చెబుతారన్న రామచంద్రయ్య… మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. ఇప్పటికి తేడా చంద్రబాబే గమనించాలన్నారు… తనపై ఎలాంటి కబ్జా ఆరోపణలు ఉన్నట్టు నిరూపించినా ఇప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.. చిరంజీవి రాజకీయాల్లోకి రావడం… పార్టీ స్థాపించడం సరైన సమయంలో జరగలేదన్నారు… సత్రాల వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు… ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ పూర్తిగా సఫలం కావడంలేదన్నారు, రాజశేఖర్‌డ్డికి తనకు దూరం మొదటినుంచే ఉందన్నారు… కిరణ్‌కుమార్ రెడ్డికి తనను మంత్రిని చేయడమే ఇష్టం లేదన్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య ఇంకా ఏమన్నారో తెలుసుకోడానికి పై వీడియోను క్లిక్ చేయండి….