ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత జట్టు ఇదే…

వరుసగా టెస్ట్‌ సిరీస్‌, వన్డే సిరీస్‌లు సాధించి జోరుమీదున్న టీమిండియా… ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు సిద్ధమవుతోంది… ఈ నెల 9 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది సెలక్షన్‌ కమిటీ… తొలి రెండు టెస్ట్‌ల కోసం భారత జట్టును ప్రకటించారు. టీమ్‌లోకి పేస్ బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ తిరిగి చోటు దక్కించుకోగా… గంభీర్‌పై మరోసారి అవకాశం ఇచ్చారు సెలక్టర్లు… న్యూజిలాండ్‌ సిరీస్‌లో శిఖర్‌ ధావ‌న్ గాయం కారణంగా అనూహ్యంగా గంభీర్‌ పిలిపించిన సంగతి తెలిసిందే..

మరోవైపు గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చింది సెలక్షన్‌ కమిటీ… రోహిత్‌ గాయం తీవ్రంగా ఉందని, సర్జరీ చేయాల్సి కూడా రావచ్చని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ఇక టీ20, వన్డేల్లో రాణించిన హార్దిక్ పాండ్యాకు టెస్టుల్లో తొలిసారి అవకాశం కల్పించింది సెలక్షన్‌ కమిటీ.

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లో తలపడనున్న టీమిండియా సభ్యులు వీరే… విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), విజ‌య్‌, ర‌హానే, ఇషాంత్‌శ‌ర్మ, ష‌మి, గౌతమ్‌ గంభీర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జ‌డేజా, జ‌యంత్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, ఉమేష్ యాద‌వ్‌, క‌రుణ్ నాయ‌ర్‌, మిశ్రా, సాహా, పుజారాను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది.