పరిశ్రమల ఏర్పాటుతోనే యువతకు ఉపాధి…

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని… లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జేపీ మండిపడ్డారు. పరిశ్రమలకు కీలకమైన పన్ను రాయితీ విషయంలో నోరు మెదపడం లేదన్నారు. పన్ను మినహాయింపులు వస్తేనే… విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు జేపీ.

కేంద్రం నుంచి రావాల్సినవి రాబట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం ప్రకారం వ్యవహరించాలని జేపీ సూచించారు. రాజు చుట్టూ ప్రజలు ఉండాలనుకోవడం రాజరికమేనని, స్విస్ ఛాలెంజ్ విధానంపై చాలా అనుమానాలున్నాయని గుర్తుచేశారు జేపీ. మాటలు చెబితే కడుపు నిండదని, మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుతోనే యువతకు ఉపాధి లభిస్తుందని జేపీ చెప్పారు.