ప్రారంభమైన నాని కొత్త సినిమా…

నాని హీరోగా కొత్త దర్శకుడు శివ నిర్వానంద్‌ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఇందులో నాని సరసన నివేధా థామస్‌ రెండోసారి జత కడుతుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

డిసెంబర్‌ 5వ తేది నుండి ఈ మూవీ సెట్స్‌మీదకు వెళ్లనుండగా, కథానుగుణంగా 90 శాతం సినిమాను అమెరికాలో తెరకెక్కించనున్నారు. ఇక ఈ మూవీకి గోపిసుందర్‌ మ్యూజిక్‌ను అందించనున్నాడు. ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం ‘నేను లోకల్‌’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.