విశాఖలో పవన్‌కు ఘన స్వాగతం…

జనసేన అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌… వైజాగ్‌ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో పవన్‌ కల్యాణ్‌కు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు… మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న జనసేనాని.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని ఉద్ధానం కిడ్నీ బాధితులను మంగళవారం పరామర్శించనున్నారు… పవన్‌కు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో విశాఖ ఎయిర్‌పోర్ట్‌ పరిసర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి.