ఆదాయం, నిర్వహణ లాభాలు తగ్గుముఖం పట్టడంతో తన సంస్థలో పనిచేస్తోన్న టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాల్లో యాపిల్ కోత విధించింది… దీనిలో భాగంగానే ఆ సంస్థ సీఈవో టిమ్‌కుక్ వేతనంలో కోత పడింది. గత 15 ఏళ్లలో తొలిసారిగా ఐఫోన్ల అమ్మకాలు నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సెప్టెంబర్ 24తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సీఈవో టిమ్‌కుక్ 8.7 మిలియన్ డాలర్లు అంటే రూ.59.3 కోట్లు… చెల్లించినట్టు రెగ్యులేటరీకి తెలియజేసింది. మొత్తంగా ఆయన జీతం 15 శాతం తగ్గించినట్టు తెలుస్తోంది. గత ఏడాది ఆయనకు దాదాపు రూ.70 కోట్లు చెల్లించారు.