‘బడ్జెట్’ తేదీలను మార్చే ప్రసక్తి లేదు -జైట్లీ

కేంద్ర బడ్జెట్ సమావేశాల తేదీలను మార్చే ప్రసక్తే లేదని తేల్చారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. బడ్జెట్‌పై నెలకొన్న వివాదంపై ఆయన స్పందిస్తూ.. మార్చిలో బడ్జెట్ ప్రవేశ పెట్టడం వల్ల అది ఆమోదం పొంది నిధులు విడుదల కావడానికి ఆలస్యం అవుతోందని చెప్పారు. అందుకే.. ఫిబ్రవరి 1వ తేదీనే కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌తో అలాంటి సమస్య ఉండదన్న ఆయన.. గతంలో రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసిన సందర్భాలు లేవని చెప్పుకొచ్చారు.