కీలక నిర్ణయం తీసుకున్న ఎయిర్‌ ఇండియా…

ఇక విమానాల్లో అతి చేస్తే అంతే… విమానాల్లో గొడవ చేస్తూ, వేధింపులకు పాల్పడే వారికి ఇక బేడీలు వేయించాలని ఎయిర్‌ ఇండియా నిర్ణయం తీసుకుంది… దీని కోసం అన్ని దేశవాళీ సర్వీసుల్లో ప్లాస్టిక్ బేడీలను కూడా సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది… పక్కవారికి విసుగు కలిగించే ప్రయాణికులకు సిబ్బంది మొదట మర్యాదపూర్వకంగా చెబుతారని… వినిపించుకోకుంటే బేడీలు వేస్తారని తెలిపారు ఎయిర్‌ ఇండియా చైర్మన్‌ అశ్వని లోహాని.

అయితే ఇప్పటి వరకూ బేడీలను అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఉంచేది ఎయిర్‌ ఇండియా… ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఇకపై దేశవాళీ సర్వీసుల్లోనూ ఈ బేడీలు ఉంచనున్నట్టు తెలిపారు. విమానంలో అతిచేసిన వారికి బేడీలు వేసి… విమానం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తర్వాత వారిని పోలీసులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తారు.