రాజ్ త‌రుణ్ డైరెక్ట‌ర్..సునీల్ హీరో?

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ హీరోగా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ప్ర‌స్తుతం ఈ యువ హీరో చేతిలో ఐదారు సినిమాలున్నాయి. ఈ సినిమా లు స‌క్సెస్ అయితే కొన్నాళ్ల పాటు కెరీర్ కు ఎలాంటి ఢోకా లేదు. అయితే సినిమా కెరీర్ ఎప్పుడు ఎలాంటి ట‌ర్నింగ్ తెలియ‌దు కాబ‌ట్టి యంగ్ హీరో సెకెండ్ ఆప్ష‌న్ ను కూడా లైన్ లో పెడుతున్నాడు. అదీ డైరక్ష‌న్ అని అంటున్నాడు. వాస్త‌వానికి యంగ్ హీరో ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చింది మంచి డైరెక్ట‌ర్ కావాల‌ని. కానీ ఇండ‌స్ర్టీ హీరోను చేసింది.

అయితే త్వ‌ర‌లో డైరెక్ట‌ర్ గా బిజీ అవుతాన‌ని అంటున్నాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో ద‌గ్గ‌ర సునీల్, బ‌న్నీలకు త‌గ్గ మంచి క‌థ‌లు ఉన్నాయ‌ట‌. ఇప్ప‌టికే సునీల్ కు ఓ క‌థ వినిపించ‌డం ఒకే చేయించుకోవ‌డం కూడా జ‌రిగిపోయింద‌ని టాక్ వినిపిస్తుంది. ఇక మిగిలిన వ్యవ‌హారమంతా ఒకే అయితే సెట్స్ కు వెళ్ల‌డ‌మే ఆల‌స్యమనే ప్ర‌చారం సాగుతోంది.