చెత్త రికార్డు సొంతం చేసుకున్న ఎయిరిండియా…

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారిని ఆకట్టుకోవడానికి విమానయాన సంస్థలు పోటీ పడుతుంటాయి… ఇక ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులకు విమానయాన ప్రయాణానికి ఆహ్వానిస్తుంటాయి. ఇవి అన్నీ ఒక వైపే… మరోవైపు తమ సర్వీసులను ఆలస్యంగా నడపడం… రద్దు చేయడం… ప్రయాణికులకు సరైన సేవలు అందించకపోవడం కూడా జరుగుతోంది… ఇవి బేస్‌ చేసుకునే ప్రతి సంవత్సరం ఫ్లైట్ స్టాట్స్ అనే సంస్థ ర్యాంకులు కేటాయిస్తోంది. ఈ ర్యాంకుల్లో మన ఎయిరిండియాకు చోటు దక్కింది.

ఎయిరిండియాకు ర్యాంకు దక్కడమంటే ఏదో మంచి సౌకర్యాలు ఇచ్చినందుకు కాదు… ఇది చెత్త రికార్డు అన్నట్టు… కేబిన్లు, సేవల నాణ్యతతో పాటు.. ఏడాదిలో విమాన సర్వీసులు ఎన్నిసార్లు ఆలస్యం అయ్యాయి, రద్దయ్యాయి, లోపల సేవలు ఎలా ఉన్నాయనే వివిధ అంశాల ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది ఫ్లైట్ స్టాట్స్ సంస్థ… 2016 సంవత్సరానికి గాకు అతి చెత్త విమానయాన సంస్థల జాబితాలో మూడో ర్యాంకు సొంతం చేసుకుంది మన ఎయిరిండియా.

ఎయిరిండియా కంటే చెత్త సర్వీసులు అందించేవారు మరో ఇద్దరే ఉన్నారు… మూడో స్థానం మనదే… గత ఏడాది అతి చెత్త రికార్డు సొంతం చేసుకున్న ఇతర సంస్థల విషయానికి వస్తే… 1. ఈఐ ఏఐ, 2. ఐలండ్‌ ఎయిర్, 3. ఎయిరిండియా, 4. ఫిలిప్పైన్ ఎయిర్‌లైన్స్, 5. ఏషియానా ఎయిర్‌లైన్స్, 6. చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్, 7. హాంకాంగ్ ఎయిర్‌లైన్స్, 8. ఎయిర్ చైనా, 9. కొరియన్ ఎయిర్, 10. హైనన్ ఎయిర్‌లైన్స్ ఉన్నాయి.