పెట్రోల్ బంకుల్లో కార్డు చెల్లింపులపై సర్‌చార్జీ రద్దు…!

డెబిట్, క్రెడిట్ కార్డులతో పెట్రోల్ కొనుగోళ్లపై సర్‌ఛార్జీ రద్దు చేసింది కేంద్రం. పెట్రోల్ డీలర్లు, వినియోగదారులు సర్‌చార్జీలు చెల్లించకుండా వెసులుబాటు కల్పించింది. అయితే,… డెబిట‌్, క్రెడిట్‌ కార్డు లావాదేవీలుపై బ్యాంకులు 1శాతం పన్ను విధించడంపై పెట్రోల్ డీలర్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నిరసనగా డెబిట్, క్రెడిట్ కార్డులు తీసుకునేది లేదంటూ అల్టిమేం జారీ చేశారు. ప్రెట్రోల్ డీలర్ల ఆగ్రహంతో సర్‌చార్జీపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది కేంద్రం. సోమవారం నుంచి కార్డులు తీసుకోమని ప్రకటించిన పెంట్రోల్ డీలర్లు.. ఆ నిర్ణయాన్ని జనవరి 13వరకు పొడగించిన సంగతి తెలిసిందే.