మెక్‌డొనాల్డ్స్‌ విక్రయం…

ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ చైనాలో తన బిజినెస్‌ను కార్లిల్, సిటిక్ గ్రూప్‌కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 2.01 బిలియన్ డాలర్ల అంటే రూ.14 వేల కోట్లుకు చైనా, హాంకాంగ్‌లోని తమ వ్యాపారాన్ని కార్లిల్ గ్రూప్‌కు అప్పజెప్పింది మెక్‌డొనాల్డ్స్‌… ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

సిటిక్‌ లిమిటెడ్‌, సిటిక్‌ క్యాపిటల్‌ హోల్డింగ్స్‌, కార్లీ గ్రూప్‌, మెక్‌డొనాల్డ్స్‌ కలిసి ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి. ఇదే అక్కడి ఫ్రాంఛైజీలకు బాధ్యత వహిస్తుంది. ఈ ఒప్పందం 20ఏళ్లపాటు అమల్లో ఉండనుంది… వ్యాపార వృద్ధి మందగించడంతో మెక్‌డొనాల్డ్స్ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా డీల్ ప్రకారం చైనా వ్యాపారంలో సిటిక్, సిటిక్ కేపిటల్‌లు 52 శాతం వాటాను దక్కించుకోనుండగా కార్లిల్‌ 28 శాతం షేర్లు దక్కనున్నాయి. కాగా, మెక్‌డొనాల్డ్స్ వాటా 20 శాతానికి పరిమితం కానుంది.