మరోసారి ‘కత్తి’ కాంబినేషన్‌…

కోలీవుడ్‌లో మురగదాస్‌, విజయ్‌ కాంబినేషన్‌ అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ చాలానే ఉంటాయి. ఎందుకంటే ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘కత్తి’, ‘తుఫాకి’ సినిమాలు రెండు బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే. ఇక తాజా సమాచారం ఈ కాంబినేషన్‌ మూడోసారి హాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మురగదాస్‌, మహేష్‌బాబు హీరోగా ‘సంభవామి’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్‌ కూడా 70శాతం పైనే కంప్లీట్‌ అయింది. ఆ తరువాత మిగిలిన పనులను పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడు. దీని తరువాత మురగదాస్‌, విజయ్‌తో సెట్స్‌ మీదకు వెళ్లనున్నాడట. దీనికి సంబంధించిన కథను కూడా మురగదాస్‌ రెడీ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు భైరవతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్‌, ఆ తరువాత అట్లీ దర్శకత్వంలో నటించబోతున్నాడు.