ములాయం ఇంటికి వెళ్లిన అఖిలేష్‌…

దేశ రాజకీయాలలోనే కీలకమైన ఉత్తరప్రదేశ్‌ పాలిటిక్స్‌ ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ఏ సమయాన ఎలా జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇలాంటి పరిణామాల్లో సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ నాటకం కొనసాగుతూనే ఉంది. తమ పార్టీ నుండి సీఎం అభ్యర్థిగా అఖిలేష్‌ పేరును ములాయం ప్రతిపాదించగా, ఇవాళ ఉదయం అతడు తండ్రి దగ్గరికి వెళ్లాడు.

ఎన్నికల గుర్తుపై ఇరు వర్గాల పోరు, పోటాపోటీగా అభ్యర్థుల జాబితా విడుదల తదితర అంశాలపై తండ్రీకొడుకులు చర్చించినట్లు సమాచారం. నామినేషన్లకు గడువు తరుముకొస్తుండటంతో ఏదో ఒక ఫార్ములాపై రాజీ పడాలని ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఆ ఫార్ములా ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. మరి ఈ ఇద్దరి భేటీకి గల కారణాలను ఎవరు బయటకు చెబుతారో చూడాలి.