విజయ్ సినిమాకు నిర్మాతగా ధనుష్‌…

కోలీవుడ్‌లో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ధనుష్‌ మంచి సక్సెస్‌ సాధించాడు. అయితే ఈ సక్సెస్‌ను అలానే కొనసాగించాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కనున్న ‘కబాలి-2’కు నిర్మాతగా వ్యవహరించనున్న ధనుష్‌, ఇప్పుడు మరో క్రేజీ హీరోకు కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం మురగదాస్‌, మహేష్‌బాబు హీరోగా ‘సంభవామి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత విజయ్‌ హీరోగా ఒక సినిమాను చేయనున్నట్లు అక్కడ ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా ఈ మూవీకి ధనుష్‌ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.