పెదనాన్నపై నిహారిక ఏమన్నదంటే…!!

నాగబాబు గారాల‌ప‌ట్టీ, యువ‌నాయిక నీహారిక ఖైదీనంబ‌ర్ 150 గురించి, పెద‌నాన్న‌గురించి స్పందించారు. డాడీ(చిరంజీవి) కొత్త సినిమాను నేనింత వరకు చూడలేదు. ఇంత వరకు పాత సినిమాలను మాత్రమే చూస్తూ అభిమానాన్ని పెంచుకుంటూ వచ్చాను! నేనిప్పుడు చిరంజీవి డాడీ నటించిన 150వ సినిమా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో డాడీ అద్భుతంగా నటించి ఉంటారనటంలో సందేహంలేదు. ఫొటోలను, టీజర్‌లను చూస్తుంటే ఎప్పటికీ మా డాడీ డాడీయే అనిపించిందంటూ ఆనందం వ్య‌క్తం చేశారు నీహారిక‌.

డైరెక్టర్‌ వినాయక్‌ గారు తమిళ సినిమా కంటే ఎంతో బాగా తీశారని అంటున్నారు. ఏది ఏమైనా డాడీ నటించిన సినిమా ఇది. గన్‌షాట్‌ హిట్‌. దేవిశ్రీ ప్రసాద్‌ గారు అందించిన పాటలన్నీ సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యాయి. ఈ చిత్రానికి ఆడియో పెద్ద సహకారాన్ని అందిస్తుంది. గుంటూరు హాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఫ్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ సూపర్‌హిట్‌ అయింది. ఈ సినిమా అంతకు మించిన విజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నాను. ఈ రీ-ఎంట్రీతో ‘డాడీ’ విజయపతాకాన్ని ఎగురవేస్తారు’ అన్నారు.