ప్రభాస్‌కు కష్టాలు తప్పట్లేదు…

ప్రభాస్‌… టాలీవుడ్‌లో ఇంతవరకు ఏ స్టార్‌ హీరో చేయనంత సాహసం చేశాడు. రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’ కోసం మూడున్నర్ర సంవత్సరాలు మరో మూవీని ఒప్పుకోకుండా ఆ చిత్రానికి ప్రాణం పోశాడు. అయితే ఇప్పుడు ‘బాహుబలి’ చెర నుండి బయటకు వచ్చేశాడు. ఇక తరువాతి సినిమాలపై కాన్సట్రేషన్‌ పెట్టనున్నాడు.

ఈ నేపథ్యంలో మొదటగా ‘రన్‌ రాజా రన్‌’ ఫేం సుజిత్‌ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం మళ్లీ కసరత్తులను మొదలు పెట్టాడు ఈ హీరో. ‘బాహుబలి’ కోసం భారీగా కండలు, శరీరాన్ని పెంచేసిన ప్రభాస్‌ తరువాత మూవీ కోసం 20కేజీల బరువును తగ్గాలట. ఈ విషయాన్ని డైరక్టర్‌ సూచించడంతో ఇప్పుడు మళ్లీ బరువు తగ్గేందుకు సన్నాహాలను ప్రారంభించనున్నాడట. మొత్తానికి ‘బాహుబలి’తో పేరు చాలా వచ్చినప్పటికీ, ఆ మూవీ కంప్లీట్‌ అయినా ఇప్పుడు ప్రభాస్‌కు కష్టాలు తగ్గడం లేదంటున్నారు కొందరు.