కేసీఆర్ ఇప్పుడేం సమాధానం చెబుతారు…

కృష్ణా ట్రిబ్యునల్ పరిధికి సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించలేదని.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలకోసమే ఉన్నానని చెప్పుకునే సీఎం కేసీఆర్.. ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు పొన్నం.

సుప్రీంకోర్టు తీర్పు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని, ప్రభుత్వం సరైన విధంగా స్పందించకపోవడం వల్లే… దాదాపు 2 కోట్ల మందికి తాగునీరు, 50వేల మందికి సాగునీటికి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా మేలుకోవాలని హితవు పలికారు పొన్నం.