వ్య‌క్తిత్వ వికాసం కేరాఫ్ చిరంజీవి: రైట‌ర్ సాయినాథ్‌

చిరంజీవి అనే మ‌నిషి ఆత్మ విశ్వాసంలో ఓ హిమాల‌యం లాంటోడు. మ‌నుషుల‌ను అర్ధం చేసుకునే డెప్త్ లో హిందూ మ‌హాస‌ముద్రంలాంటోడని అంటున్నారు సీనియ‌ర్ ర‌చ‌యిత సాయినాథ్‌. ‘స్వ‌యంకృషి’ నుంచి ర‌చ‌యిత‌గా చిరుతో ఉన్న సాన్నిహిత్యంతో 150వ సినిమా గురించి చెబుతూ చిరుని ఆయ‌న ద‌గ్గ‌ర‌గా చూసిన విష‌యాలు చెప్పారిలా…

ఇండ‌స్ట్రీకి ఫ్యాష‌నేట్‌గా తెలుగు సినిమా అంటే ఒక జాతీయ ప‌తాకానికి గౌర‌వం ఇచ్చే మ‌నిషి. అలాగే అభిమానులంటే ప్రాణం. ఇవేగాకుండా ఒక కుటుంబ పెద్ద‌గా, త‌మ్ముళ్లుల‌ను, చుట్టుప‌క్క‌ల వారికి అంద‌రికీ పెద్ద అన్న‌య్య అంటే ఎలా ఉండాలో డిఫైన్ చేశాడు. అత‌నిలో ఇవ‌న్నీ నాకు బాగా న‌చ్చాయి. వ్య‌క్తిత్వ వికాసానికి కేరాఫ్ అడ్ర‌స్ ఆయ‌న‌. మీ అంద‌రికీ తెలుసు వండ‌ర్‌ఫుల్ డాన్స‌ర్. వండ‌ర్‌ఫుల్‌ ఫైట‌ర్, పెర్పామ‌ర్. ఎక్స‌లెంట్ డెడికేష‌న్ ఎన‌ర్జీ , క్ర‌మ‌శిక్ష‌ణ‌ ఉన్న ఒక డివోటెడ్ సెల‌బ్రిటీ. నిజానికి ఆ ప‌దాల‌కు ర‌జనీకాంత్, చిరంజీవి, అమితాబ్.., ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్. వీళ్లే ఎగ్జాంపుల్ అనిపించే అద్భుత‌మైన వ్య‌క్తులు. అనిత‌ర సాధ్య‌మైన స‌క్సెస్ ను కేవ‌లం వ్య‌క్తిత్వ వికాసం తో సాధించుకున్న ఒక ప‌రిణితి చెందిన మ‌హా న‌టులు.

చిరు న‌టించిన ఈ 150వ సినిమా ‘ఖైదీ నంబ‌ర్ 150’ మాతృక‌ త‌మిళ సినిమా చూశాను. అద్భుతంగా ఉంటుంది. కాబ‌ట్టి ఆ మాస్ క్యారెక్ట‌ర్ తో బాస్ ఆడుకుంటాడ‌ని తెలుసు. అలాగే ప‌త్తి రైతుల కోసం అత‌ను ప‌డ్డ బాధ‌ను చిన్న‌ప్పుడే చూశాను. కాబ‌ట్టి అత‌నికి రైతుల ప‌ట్ల ఉన్న అవ‌గాహన‌, అత‌ని అభిప్రాయాలు నాకు ఆరోజు నుంచే తెలుసు కాబ‌ట్టి నిజాయితీ ఉంది. రెండో పాత్ర సైంటిస్ట్ పాత్ర అద్భుతంగా పండిస్తాడ‌ని న‌మ్మ‌కం ఉంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం ఇర‌గ‌దీశాడు. ‘అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు’ ఆల్రెడీ పెద్ద హిట్. మ్యూజిక‌ల్‌గా సినిమా ఎక్స్ ట్రార్డిన‌రీ. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో అక్క‌డకు వ‌చ్చిన జనాన్ని చూశాను. 115 డేస్ ఆడి కొత్త రికార్డు సృష్టిస్తుంది. తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీకి కొత్త స‌రిహ‌ద్దులు గీస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉందంటూ” నాటి-నేటి ‘చిరు’ సంగ‌తుల్ని గుర్తు చేసుకున్నారు రైట‌ర్ సాయినాథ్.