సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం…

ఆర్థికంగా కష్టకాలమే అయినప్పటికీ సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషిచేస్తున్నామని అన్నారు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. సంక్షేమ శాఖలు తమ బడ్జెట్టు కేటాయింపుల్లో సగానికి పైగా ఖర్చు పెట్టాయని చెప్పారు. రెవెన్యూ లోటు భర్తీలో భాగంగా ఇంకా 7వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో అభివృద్ధి బాగుందని రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర నుంచి రెండు లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగిందని తెలిపారు ఆర్థికమంత్రి యనమల