ఇద్దరు ఉగ్రవాదుల హతం…

జమ్మూ అండ్‌ కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్నాయి భద్రతాదళాలు. భారత్‌లో చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని సైనిక అధికారి తెలిపారు.

ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఎల్వోసీలో ఉదయం నుంచి భారీగా కూంబింగ్ చేపట్టాయి భారత బలగాలు… దీంతో ఇండో-పాక్ సరిహద్దులో మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు సంచరిస్తున్న వీడియో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన సైన్యం ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తోంది.