రాహుల్ పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారు…

రాహుల్ గాంధీపై మండిపడ్డారు బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్. రాహుల్ గాంధీ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే నేతలెవ్వరూ విశ్రాంతి తీసుకోరని.. కానీ రాహుల్ మాత్రం సెలవు తీసుకున్నాడంటూ ఎద్దేవా చేశారు. నల్లధనంపై మోడీ యుద్ధం చేస్తుంటే… కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ప్రజలంతా మోడీ వైపే ఉన్నారన్నారు షానవాజ్.