రిపబ్లిక్ డే ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష…

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే 68వ గణతంత్రదినోత్సవ వేడుకలకు ప్రణాళికా ప్రకారం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎస్‌ యస్.పి.సింగ్. రిపబ్లిక్‌ డే వేడుకల ఏర్పాట్లపై సెక్రటేరియట్‌లో సంబంధిత అధికారులతో సమావేశమైన ఆయన.. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరవుతారని తెలిపారు.

పోలీస్‌లు బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు సింగ్‌. వేడుకకు హాజరయ్యే పాఠశాల విద్యార్ధుల కోసం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేయాలని అన్నారు. గ్రౌండ్ పరిసరప్రాంతాల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు ఉండేలా  ఏర్పాట్లు చేయాలన్నారు సీఎస్.