నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు…

పెండింగ్‌ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేసి.. రైతులగు సాగునీరు అందిస్తామన్నారు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌ రావు. కొమురంభీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాలో పర్యటించిన మంత్రి. ఇందిరాక్రాంతి పథకంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాల్‌మిల్‌ను ప్రారంభించారు. అనంతరం కోమురంభీమ్‌ ప్రాజెక్టును సందర్శించి కాలువల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు హరీష్‌రావు.