శ్రీకాంత్‌రెడ్డి నువ్వు అంత మొగోడివా?-జేసీ

వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డిపై జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నన్ను జానీవాకర్ అంటావా ? అసలు తనకు తాగే అలవాటే లేదని హుంకరించారు. తాను బూట్లు నాకేవాడినే అయితే ఎప్పుడో మంత్రయ్యేవాడనని అన్నారు జేసీ. అనుభవం లేనివాడు నన్ను విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. పులివెందులలో రక్తపాతం వద్దని హితవుపలికారు జేసీ.

ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తానన్న శ్రీకాంత్ రెడ్డిపై మండిపడ్డారు జేసీ దివాకర్‌రెడ్డి… ఎవడ్రా వాడు శ్రీకాంత్ రెడ్డి? నా నాలుక కోస్తాడా? అరేయ్ నీ ఊరికి వస్తా… పులివెందులకు వస్తా… దమ్ముంటే నన్ను ముట్టుకో… ఏం జరుగుతుందో చూడూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడో చెప్పిన మాటలు విని, నన్నే కామెంట్ చేస్తావా అంటూ ఊగిపోయారు జేసీ… శ్రీకాంత్‌రెడ్డిపై జేసీ చేసిన సంచలన వ్యాఖ్యల కోసం పై వీడియోను క్లిక్‌ చేయండి…