మోహన్‌లాల్‌ ‘కనుపాప’ వచ్చేస్తోంది…

మలయాళంలో తాను నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఒప్పం’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. ‘ఒప్పం’ను తెలుగులో ‘కనుపాప’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ఆడియోను ఈ నెల 25న రిలీజ్‌ చేసి… ఫిబ్రవరి 3వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

మ‌ల‌యాళంలో ‘ఒప్పం’ అన్నివ‌ర్గాల ప్రేక్షకులను ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసి రూ.50 కోట్లుకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని క‌న్నడ‌లో శివ‌రాజ్ కుమార్, హిందీలో అజ‌య్ దేవ‌గ‌న్ రీమేక్ చేస్తున్నారు. తెలుగులో దిలీప్ కుమార్ బొలుగోటి స‌మ‌ర్పణ‌లో మోహ‌న్ లాల్ నిర్మాత‌గా ‘క‌నుపాప’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రంలో మోహ‌న్ లాల్ అంధుడిగా న‌టించారు… ఒప్పంను ఆద‌రించిన‌ట్టే తెలుగులో ‘క‌నుపాప‌’ ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నానని తెలిపారు మోహన్‌లాల్‌.