‘రైతు’ సినిమాపై బాలయ్య మాట…

తన వందో సినిమాగా ‘రైతు’ చేద్దామనుకున్నామని తెలిపారు నటసింహ నందమూరి బాలకృష్ణ… ఈ సినిమాలో నటించాల్సిందిగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్ బచ్చన్‌ను కోరామన్నారు. ‘రైతు’ సినిమా ఆర్డర్‌ అంతా రెడీగా ఉందన్న బాలయ్య… దీనిపై అమితాబ్‌ సమయం కోరారని తెలిపారు… అమితాబ్ బచ్చన్‌ చేయకపోతే ‘రైతు’ సినిమాయే ఉండదన్నారు.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా పై వ్యాఖ్యలు చేశారు బాలయ్య… తన వందోసినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో నానుంచి అభిమానులు కోరుకునే అన్నిహంగులు ఉంటాయని తెలిపారు… నా అన్ని సినిమాలు ప్రేక్షకులకు ఫుల్‌మీల్స్‌ వంటివని ఆయన తెలిపారు… ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘రైతు’ సినిమాపై బాలయ్య మాటల కోసం పై వీడియోను క్లిక్‌ చేయండి…