బాలయ్య ‘శాతకర్ణి’ ముచ్చట్లు…

తన వందో చిత్రంగా రొటీన్‌ స్టోరీ చేయాలనుకోలేదన్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ… తాను నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మైలురాయి చిత్రంగా నిలుస్తుందని తెలిపారు. క్రిష్‌ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకులకు ముందుకు రానున్న సందర్భంగా ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకున్నారు బాలయ్య.

100వ సినిమా కథ గురించి సతమతమవుతున్న సమయంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కథ వచ్చిందన్నారు బాలయ్య… ఈ సినిమాకు క్రిష్‌తో నాకు పెద్దగా పరిచయం లేదన్నారు. క్రిష్‌ చేసిన అన్ని సినిమాలు నేను చూడలేదు కానీ, కథలు విన్నానన్న బాలయ్య… విభిన్నమైన సినిమాలు తీసిన క్రిష్‌ కథ చెప్పగానే నాకు నమ్మకం కలిగిందన్నారు. ఈ సినిమాలో గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలపై ప్రత్యేక శిక్షణ ఏమీ తీసుకోలేదన్నారు. క్రిష్‌ కథ చెప్పగానే తల్లిపాత్ర ఎవరు చేస్తున్నారని అడిగానన్నారు… ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో గౌతమిపుత్ర శాతకర్ణి, తన భవిష్యత్‌ ప్రాజెక్టులు… రాజకీయాలపై బాలయ్య మాటల కోసం పై వీడియోను క్లిక్‌ చేయండి…