సుప్రీంకోర్టులో నరేంద్ర మోదీకి ఊరట…

సుప్రీంకోర్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఊరట లభించింది… గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహారా, బిర్లా నుంచి మోదీ ముడుపులు తీసుకున్నారని ఆరోపిస్తూ… ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ ‌ప్రశాంత్ భూషణ్‌ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది కోర్టు. డైరీలను ఫ్రూప్‌గా పరిగణించలేమని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ప్రశాంత్‌ భూషణ్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు… ఆ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొంది. దీంతో సహారా డైరీల కేసులో మోదీకి ఊరట కలిగింది.