త్వరలోనే ఓఎల్‌ఎక్స్‌లోకి వైఎస్‌ఆర్సీ…!

వైఎస్‌ఆర్సీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో జైలుకు వెళ్లక తప్పదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌… వైఎస్‌ఆర్సీని ఓఎల్‌ఎక్స్‌లో పెట్టడం ఖాయమన్నారు. జగన్ రూ.104 కోట్లు డిపాజిట్ చేశాడని మాయావతి బంధువులు చెప్పడం హాస్యాస్పదమన్నారు పయ్యావుల. హింగోరా అఫ్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుబడులు పెట్టిన జగన్… జగతి పబ్లికేషన్ ద్వారా అక్రమ వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు కేశవ్‌.

అవినీతి మూలాలనుండి దృష్టి మరల్చడానికే టీడీపీపై వైఎస్‌ జగన్ ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు పయ్యావుల. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల వివరాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు… మీరు చెప్పక పోతే మేమే ప్రజలకు వివరిస్తామన్నారు. నల్లధనం, జగన్ రెండు అవిభక్త కవలలు అన్నారు పయ్యావుల. ఐటీ అధికారులు, ఈడీ జగన్‌ను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. జగన్‌ పార్టీని ఓఎల్‌ఎక్స్‌లో పెట్టే తరుణం దగ్గరలోనే ఉందన్నారు.

రాయలసీమకు నీళ్లు ఇస్తుంటే వైఎస్‌ జగన్‌ తట్టుకోలేక పోతున్నాడని విమర్శంచారు పయ్యావుల కేశవ్‌. ఏపీ సీఎం చంద్రబాబు జల జాతరలో వైఎస్‌ జగన్, ఆయన పార్టీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో జల జాతర మొదలయ్యిందని తెలిపారు పయ్యావుల కేశవ్‌.