రెడ్లు రెడ్లు అంటున్నారు… నేను రెడ్డిని కాదా?

వైఎస్‌ఆర్సీ అధినేత వైఎస్‌ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి… మాటికిటాటికి రెడ్లు రెడ్లు అంటున్నారు… నేను రెడ్డిని కాదా అని ఆయన ప్రశ్నించారు. కడప జిల్లా సింహాద్రిపురం మడలం పైడిపాలెంలో ఎత్తిపోతల పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న జేసీ… తాను నిఖార్సైన రెడ్డినని చెప్పారు. తాను కంత్రీ రెడ్డిని కాదని, అసలు సిసలు రెడ్డినని తెలిపారు.

ఎన్నికల్లో మాకు పోటీ ఎందుకు పెడతారు…? మేమూ రెడ్లమే కదా! మాకు పోటీ పెట్టకండి… మా స్థానాలను మాకు ఏకగీవ్రం చేయండి అని జగన్‌కు సూచించారు జేసీ. రెడ్ల స్థానాలను జగన్‌ ఏకగ్రీవం చేస్తే… జైజై రెడ్లు అంటూ తానూ నినాదాలు చేస్తానని తెలిపారు జేసీ దివాకర్‌రెడ్డి… నీకు అవసరం వచ్చినప్పుడే రెడ్లా అని జగన్‌ను ప్రశ్నించారు జేసీ. కులం, వర్గం పట్టుకుంటే లాభం లేదని… కులం, వర్గం అన్నీ పక్కనపెట్టి ప్రజలు ఆలోచించాలని తెలిపారు.