కాకాని డాక్యుమెంట్లన్నీ నకిలీవే…!

నెల్లూరు జిల్లా రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి.. సోమిరెడ్డికి విదేశాల్లో అక్రమాస్తులు ఉన్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి బయటపెట్టిన డాక్యుమెంట్లు నకిలీవంటూ పోలీసులు చెబుతున్నారు. తప్పుడు పత్రాలతో తనపై అవినీతి ఆరోపణలు చేశారని ఎమ్మెల్సీ సోమిరెడ్డి గతంలో కాకానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ పత్రాలు సృష్టించారంటూ ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు కేసును పక్కదారి పట్టించేందు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి ఆరోపించారు. సోమిరెడ్డి సూచనల మేరకే జిల్లా పోలీసులు పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉన్నతస్థాయి విచారణ జరపకుండా పోర్జరీ అని కేసు ముగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పోలీసులు విచారణలో మూలాలు కనిపెట్టకుండా ముగ్గురు అనామకులను కేసులో ఇరికించారని మండిపడ్డారు. సీబీఐసి, ఈడితో విచారణ జరిపించాలని కాకాని డిమాండ్ చేశారు.