జేసీ వ్యాఖ్యలకు శ్రీకాంత్‌రెడ్డి కౌంటర్‌…

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కామెంట్లపై సీరియస్‌గా స్పందించారు వైఎస్‌ఆర్సీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి… ఓ రాజకీయ నాయకుడు… మీ ఊరికొస్తా… మీ ఇంటికొస్తా, మీ నట్టింటికొస్తా అని సినిమా డైలాగ్‌లు మాట్లాడుతున్నారని… ఇది రౌడీల భాష అన్నారు శ్రీకాంత్‌రెడ్డి. అనంతపురంలో ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా రూపుమాపాలన్న ఉద్దేశంతోనే వైఎస్‌… ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారన్నారు.

రౌడీల భాష మాట్లాడుతూ… ఫ్యాక్షనిజం రూపుమాపిన వైఎస్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు శ్రీకాంత్‌రెడ్డి… జేసీ దివాకర్‌రెడ్డిలా సంస్కారం లేని భాష మాకు రాదన్నారు. సంస్కారంతో, క్రమశిక్షణతో మేం రాజకీయాలు చేస్తాం. ప్రోటోకాల్ లేని వేదికలెక్కి జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతున్నా సీఎం చంద్రబాబు ఏమీ అనకపోవడం విడ్డూరమన్నారు శ్రీకాంత్‌రెడ్డి.

నేను గతంలో చెప్పినట్టు జేసీ దివాకర్‌రెడ్డి… జానివాకర్‌రెడ్డే అన్నారు శ్రీకాంత్‌రెడ్డి… జేసీ సభలకు 4 లేదా 6 పెగ్గులు వేసి వస్తున్నాడేమో… మద్యం కంటే ప్రమాదమైన డ్రగ్స్ వాడుతున్నారేమో అన్నారు శ్రీకాంత్‌రెడ్డి. మేం రౌడీలను చుస్తే దూరంగా ఉంటాం. పరిటాల రవిని చూసి భయపడి తడిపత్రిలో నామినేషన్ వేయకుండా పారిపోయారని ఆరోపించారు. మీలా చెంచా రాజకీయాలు మాకు రావు అని… మీ కంటే రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచే వచ్చామని తెలిపారు శ్రీకాంత్‌రెడ్డి.