ధోనీ లేడుకాబట్టే యువీకి అవకాశం…

మరోసారి ధోనీపై తీవ్రవ్యాఖ్యలు చేశాడు యువరాజ్‌ తండ్రి… మహేంద్ర సింగ్‌ ధోనీ టీమిండియా కెప్టెన్‌ కాదుకాబట్టే యువరాజ్‌సింగ్‌కు తిరిగి జట్టులో అవకాశం లభించిందన్నారు యువరాజ్‌సింగ్‌ తండ్రి యోగరాజ్‌సింగ్‌… గతంలోనూ ధోనీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన యువరాజ్‌ తండ్రి… మరోసారి ధోనీపై మండిపడ్డారు.

అయితే రెండేళ్ల క్రితమే యువరాజ్‌ జట్టులోకి రావాల్సిందని… ఆలస్యంగా ఇది జరిగిందని ఆయన పేర్కొన్నారు యువీ తండ్రి. మరోవైపు ధోనీ, నేను మంచి స్నేహితులమంటూ సోషల్‌ మీడియాలో యువరాజ్‌సింగ్‌ నిన్నే ఓ పోస్ట్‌ పెట్టారు. యువీ పోస్ట్‌ పెట్టిన తర్వాత రోజే యువీ తండ్రి ఇలా స్పందించాడు మరి. కాగా ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు సెలక్టర్లు యువీకి జట్టులో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే.