ముగిసిన నాల్గోరోజు ఆట…

రాంచీ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌ రసకందాయంలో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో 451 పరుగులు చేసి కంగారూలు ఆలౌట్‌ కాగా… తర్వాత ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా ధీటైన జవాబే ఇచ్చింది… ముఖ్యంగా పుజారా డబుల్‌ సెంచరీతో ఆసీస్‌కు షాకివ్వగా… సాహా సెంచరీ చేసి కదంతొక్కాడు… విజయ్‌ 82, రాహుల్‌ 67… చివర్లో రవీంద్ర జడేజా 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు… దీంతో 603 పరుగుల భారీ స్కోర్‌ చేసింది టీమిండియా… 9 వికెట్ల నష్టానికి 603 పరుగుల దగ్గర భారత్‌ డిక్లేర్డ్‌ చేసింది.

దీంతో 152 పరుగులు వెనుకబడిన ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది… ఆదిలోనే తడబడింది… నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది ఆస్ట్రేలియా… జట్టు స్కోరు 17 పరుగుల వద్ద జడేజా బౌలింగ్‌లో 14 పరుగులు చేసిన వార్నర్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. మూడో టెస్ట్‌ ముగియడానికి ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో గెలుపుపై భారత్‌ ఆశలు చిగురిస్తున్నాయి. చివరిరోజు బౌలింగ్‌కు పిచ్‌ అనుకూలించే అవకాశం ఉండడం… ఇంకా 129 పరుగుల ఆధిక్యంలో ఉండడం భారత్‌ను కలిసివచ్చే అంశాలు.

Comments

comments