‘దేవాన్ష్’ పేరుతో తిరుపతిలో అన్నదానం…

ఏపీ సీఎం గారాల మనుమడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తనయుడు దేవాన్ష్‌ పేరు మీద మంగళవారం తిరుపతిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు తెలిపారు. మంగళవారం దేవాన్ష్‌ పుట్టిన రోజు సందర్భంగా.. దేవాన్ష్‌ పేరుతో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని.. అందుకు గాను సీఎం చంద్రబాబు శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చారని తెలిపారు టీటీడీ జేఈవో. తిరుపతి శ్రీవారి అన్నప్రసాదం కోసం ఒక రోజు ఖర్చు భరిస్తానని సీఎం చెప్పినట్లు వెల్లడించారు. ఈ మేరకు నారావారి వారసుని పేరుతో రేపు తిరుపతిలో అన్నదాన కార్యక్రమం జరగనుంది.