టపు టపు టపోరి .. కన్యా కుమారి… అంటూ అప్పట్లో మెగాస్టార్ సాంగేసుకున్నాడు. బాస్ ఓల్డ్ క్లాసిక్ సాంగ్ ఇది. ఈ సాంగ్ ఇప్పుడు వార్తల్లోకొచ్చింది. ఎందుకంటే ఈ లిరిక్ లోంచి `టపోరి`ని పూరి లేపేశాడు. అది కూడా బాలయ్య కోసం లేపేశాడు. తాజాగా బాలయ్యతో చేస్తున్న సినిమాకి పూరి ఈ టైటిల్‌ని ఫైనల్ చేసేశాడని చెబుతున్నారు.
తిట్లు, చీవాట్లను సినిమాలకు టైటిల్స్‌గా పెట్టుకునే పూరి జగన్నాథ్ ఇప్పుడు మరో తిట్టు లాంటి టైటిల్‌ని బాలయ్యకు సెలక్ట్ చేశాడంటూ ఇండస్ట్రీలో ఒకటే ముచ్చట పెట్టుకుంటున్నారు. కథ ప్రకారమే టైటిల్ పెట్టుకున్నాంలే! అని బాలయ్య, పూరి కవరింగ్ చేయాలని చూసినా.. జనం అనాల్సింది అనేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ హైదరాబాద్‌లో సాగుతోంది. భారీ యాక్షన్ సీన్స్‌ని పూరి తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ టపు టపు టపోరి అంటూ బాలయ్య పోరీల వెంట పడడు కదా? ప్చ్!!