బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామా?

మంగళవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌… మంగళవారం సీఎం కె.చంద్రశేఖర్‌రావును కలిసి రాజీనామా లేఖ అందిస్తాన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్‌. హైదరాబాద్‌ దూల్‌పేట ప్రజలకు మంచి చేస్తానని సీఎం మాటతప్పారని ఆరోపించారు రాజాసింగ్‌. సారా వ్యాపారం మానేసినవారికి… ప్రత్నామ్నాయం చూపటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. తక్షణమే వారికి ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు…