కెప్టెన్‌ ఎవరైనా ఫస్ట్‌ ఛాయిస్‌ అతనికే…

టీమిండియా కెప్టెన్‌గా ఎవరున్నా… అతనే ఫస్ట్ ఛాయిస్… బౌలింగ్‌లో కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడతాడు.. అవసరమనుకుంటే, బ్యాటింగ్‌లో మెరుపులూ మెరిపిస్తాడు.. ఓవరాల్‌గా అతనో రాక్‌స్టార్… ఆల్‌రౌండర్ రవీంద్రజడేజా.. టీమిండియాకు సగం బలమయ్యాడు. గత ఏడాది నుంచీ… టీమిండియా టెస్ట్ విజయాల్లో రవిచంద్రన్ అశ్విన్‌తో సమానమైన రోల్‌ను ప్లే చేస్తున్నాడు జడ్డూ… అశ్విన్‌తో కలిసి బౌలింగ్ దాడిని మోస్తున్న జడ్డూ… అవసరమైన సందర్భాల్లో బ్యాటింగ్‌లోనూ తడాఖా చూపిస్తున్నాడు… గత ఆరు టెస్టుల్లో జడేజా బ్యాటింగ్‌లో మూడు హాఫ్‌ సెంచరీలు కొట్టడమే కాదు… వికెట్లు తీయడంలో.. అశ్విన్‌తో పోటీ పడ్డాడు కూడా… ఇప్పుడు బోర్డర్ , గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియన్లను తన స్పిన్‌తో ఊపిరాడకుండా చేస్తున్నాడు.

ఉపఖండంలో జడేజా బౌలింగ్ యావరేజ్ అద్భుతంగా ఉంది… మరే భారత బౌలర్‌కూ సాధ్యంకాని రికార్డ్ జడ్డూది.. కనీసం వంద వికెట్లు ఉపఖండంలో తీసిన బౌలర్లలో… ఇమ్రాన్ ఖాన్, ముత్తయ్య మురళీధరన్ తర్వాత జడేజానే బెస్ట్… అంతేకాదు, మురళీ , ఇమ్రాన్‌కన్నా.. మంచి సగటూ టీమిండియా ఆల్‌రౌండర్‌దే… ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు జడేజానే మెయిన్ వెపన్‌గా ఉండేవాడు… ఇప్పుడు కెప్టెన్ మారాడుగానీ.. ఛాయిస్ మారలేదు… బంతిని అందుకున్న ప్రతీసారీ జడేజా సక్సెస్ అవుతున్నాడు… అంతేకాదు, కోహ్లీ కెప్టెన్సీలోనే టెస్టుల్లో నిలకడగా బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు.ఈ సీజన్‌లో ఇప్పటికే 65 వికెట్లు తీసిన జడ్డూ.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో లిస్టులో స్టెయిన్, అశ్విన్ తర్వాతి ప్లేస్‌లో ఉన్నాడు… ఒకానొకటైమ్‌లో, జట్టులో అనవసరమైన ప్లేయర్ అన్పించుకున్న జడేజా.. ఏడాది తిరిగేసరికి, కెప్టెన్లకు ఫేవరేట్ ప్లేయర్ అన్పించుకునే స్ధాయికి ఎదిగాడు.