కేసీఆరే అసలు సిసలైన కమ్యూనిస్టు-కేటీఆర్‌

దేశంలో అసలు సిసలైన కమ్యూనిస్టు సీఎం కేసీఆరే అన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌… కమ్యూనిస్టు సిద్ధాంతాలు కేసీఆర్‌ సారథ్యంలోనే సాధ్యం అని చెప్పారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నేత మెట్టు శ్రీనివాస్‌తో పాటు ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌లోకి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి ఆహ్వానించిన కేటీఆర్‌… టీఆర్‌ఎస్‌ పార్టీ పేరులో కమ్యూనిస్టు ఉండక పోవచ్చు కానీ, ఎజెండా మాత్రం అదేనని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన కేరళ సీఎం విజయన్‌… తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలను ప్రశంసించారు… కేరళ సీఎంకు తెలంగాణ పాలనా నచ్చింది… కానీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి మాత్రం అర్ధం కావటం లేదన్నారు కేటీఆర్‌. రెండు లక్షల ఇల్లు కట్టి తిరుతామని స్పష్టం చేశారు. ఎర్రజెండాలు కప్పుకున్న నాయకులకు గుండె నిండా తెలంగాణ మీద కోపం ఉందన్న కేటీఆర్‌… అప్పుడు రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డారు… ఇపుడు బంగారు తెలంగాణకు అడ్డం అడ్డం పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.